పూజగదిలో గోపురం నిర్మించొచ్చా..?

గురువారం, 21 మార్చి 2019 (11:18 IST)
సాధారణంగా పెద్దపెద్ద గృహాల్లో హాలుకు సమీపంలోనే పూజగది ఉంటుంది. ఇలాంటి పూజగదులకు గోపురం పెట్టుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఇలాంటి గోపురాన్ని ఇంటిలోని పూజగదిలో పెట్టుకోవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తే.. 
 
గోపురం ప్రధానంగా పూజగదుల్లోనే ఉండాలి. రోజూ నిష్టతో అభిషేకాలు, అర్చనలు మరింత నిష్టతో చేసేవారికి ఇది ప్రేరణ కలిగిస్తుంది. దేవుని గదిలోని వాతావరణాన్ని ఆరోగ్యకరంగా మలుస్తుంది. లోపలి విగ్రహాలకు చల్లదనాన్ని, వాటి నిగనిగలను పోకుండా కాపాడుతుందని చెపుతున్నారు. 
 
ఆ చిన్న పూజగదిలో పెట్టే నైవేద్యాలు, పూలు సాయంత్రం వరకు తాజాదనాన్ని కోల్పోకుండా ఉంటాయి. నెత్తి మీద టోపి పెట్టుకుంటే తలపైన మనకు తెలియకుండా చల్లదనాన్నిస్తుంది. అలాగే, పూజగదిలో గోపురాన్ని పెట్టుకోవడం కూడా ఇలాంటి వాతావరణనాన్నే కల్పిస్తుందని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు