ఇంటికి వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులను వేయడం ద్వారా సానుకూల ఫలితాలుంటాయి. భవనం గోడలకు వాస్తు రంగులను ఉపయోగించడం ద్వారా ఆ ఇంట నివసించే వారికి, బయటి నుంచి చూసేవారికి అనుకూల ఫలితాలుంటాయి. వాస్తు రంగుల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓ భవనానికి వెలుపల, లోపల వాస్తు ప్రకారం ఈ రంగులను ఉపయోగిస్తే.. ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
అయితే లేత ఆకుపచ్చరంగుతో కూడిన పెయింట్‌ను తూర్పు వైపునున్న పడకగదులకు ఉపయోగించకూడదు. అలాగే లేత నీలి రంగులను పడకగదికి ఉపయోగించడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒంటి నొప్పులు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య జగడాలకు తావుండదు. నీలి రంగు ఆకాశానికి, నీటికి ప్రతీక కావడంతో భాగస్వాముల మధ్య నిజాయితీ, దాపరికం లేని జీవితాన్ని పెంపొందింపజేస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు.