అలాగే ఆగ్నేయంలో డార్క్ బ్లూ రంగులు, వైలెట్ రంగులను ఉపయోగిస్తే.. శీతల వ్యాధులు, ప్రమాదాలు జరిగే అవకాశం వుందని, అనవసరమైన ఖర్చులుంటాయి. బ్లూకలర్ వాటర్ ఎలిమెంట్ కావడంతో దానిని ఆగ్నేయంలో వాడటం మంచిది కాదు.
ఎలక్ట్రిక్ వస్తువులు పాడైపోతాయి. అలాగే ఈశాన్యంలో పనికిరాని వస్తువులను వుంచితే.. పాడైన ఎలక్ట్రిక్ వస్తువులు, చీపుర్లు, ముగ్గుపిండి డబ్బాలు వుంచితే ఇంటి యజమానికి అనారోగ్యం తప్పదని వాస్తు నిపుణులు అంటున్నారు. కీళ్ళనొప్పులు వస్తాయి. ఆ ఇంట మగ సంతానానికి శ్వాస సంబంధిత రుగ్మతలు తలెత్తే ఆస్కారం వుంది.
ధన నష్టం ఏర్పడుతుంది. ఆదాయం వుండదు. ఖర్చులు పెరిగిపోతాయి. ముఖ్యంగా వాయువ్యంలో పనికిరాని వస్తువులు, సామాగ్రిని వుంచితే ఆ ఇంట నివసించే మహిళలకు మానసిక ఇబ్బందులు ఏర్పడుతాయి. ఏ దిశలోనైనా, ఇంట్లో అయినా పనికిరాని ఎలక్ట్రిక్ వస్తువులు ఇంట్లో నుంచి నేరుకు డస్ట్ బిన్‌లో పారేయడం మంచిది.