కుజగ్రహ దోషం ఉందా.. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి!

సోమవారం, 10 నవంబరు 2014 (15:37 IST)
చాలామందికి జాతకరీత్యా వివిధ రకాల దోషాలు ఉంటాయి. ఇలాంటి దోషాల్లో ఒకటి కుజ దోషం. ఈ దోషం ఉన్నవారు వివిధ రకాల పూజలు చేస్తూ, మంత్రాలు జపిస్తూ, జాతక చక్రానికి అనువుగా ఉండే రత్నాలను ధరిస్తే సరిపోతుందని జ్యోతిష్య నిపుణులు చెపుతుంటారు. 
 
అంతేకాకుండా, కుజగ్రహం దోషం ఉన్నవారు మంగళవారం రోజు మంచి పగడం ధరించడం ఎంతో ఉత్తమమని చెపుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామివారి పూజలు, కుజ మంత్రంతో అనుసంధానం జేసి మంగళవారం రోజు పగడాన్ని ధరించడం ద్వారా కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
కుజగ్రహ ప్రభావంతో వచ్చే అంటువ్యాధులు తొలగిపోవటానికి ఎర్రని వస్త్రాలు ధరించడం, ఎరుపు రంగు కిటికీ గ్లాసులు కలిగి ఎరుపు రంగు పెయింట్ వేయబడిన గది గోడల మధ్య ఉండటం మంచిది. పగడం ఎర్రని కాంతి పుంజాలను విరజిమ్మే ఉష్ణతత్వం గల రత్నం కావడంతో పగడాన్ని ధరించడం మంచిది. 

వెబ్దునియా పై చదవండి