వాస్తు ప్రకారం చూస్తే దేవుళ్ళ విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. ఉదయం సూర్యకిరణాలు ఈశాన్య, తూర్పు దిక్కు నుంచి ప్రసరిస్తాయి కాబట్టి. సాయంకాలంలో పడమర నుంచి కిరణాలు వస్తాయి. కాబట్టి విగ్రహాల మీద పడి మరింత భక్తి భావనను కలిగిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కున అస్సలు పెట్టకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈశాన్యంలోనే పూజ గదిని కూడా ఏర్పాటు చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి.