అలాగే ఇంటి ఆవరణలో తూర్పు ఈశాన్యమున గాని, ఉత్తర ఈశాన్యమున గాని బోరు వేసుకోవచ్చును. తూర్పునగానీ, ఉత్తరమునగాని నీలు లభ్యము కానప్పుడు పడమరలో పంపు వేసుకోవచ్చు.
ఇక నైరుతి ఇంటికి ద్వారం ఉండకూడదు. అది దక్షిణ నైరుతి అయినా, పడమర నైరుతి అయినా అక్కడ ద్వారం ఉండటం మంచిది కాదు. దక్షిణంలోగానీ (నైరుతి నుండి సగం దూరం దాటిన తర్వాత) దక్షిణ ఆగ్నేయంలో గానీ సింహ ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.