గోతులు నూతులు ఇంటి స్థలంలో పెట్టాలంటే?

గురువారం, 14 మే 2015 (15:07 IST)
గోతులు, నూతులు ఇంటి స్థలంలో పెట్టాలంటే. దక్షిణ, పడమర ఆగ్నేయ, నైరుతులు పనికిరావని వాస్తు నిపుణులు అంటున్నారు. ఉత్తర దిశలో నూతులు ఉండటం శ్రేయస్కరం. ఇలాగే ప్రధానంగా సెప్టిక్ ట్యాంక్ తూర్పు మధ్య భాగంలో లేదా ఉత్తర మధ్య భాగంలో వేసుకోవాలి. వదిలి వేసిన స్థలం తిరిగి వాడకూడదు. ఏరేసిన చెత్త తిరిగి ఇంట్లో చల్లుకున్నట్లు వుంటుంది. స్థలం శుద్ధి చేసుకొని వాస్తుకు ప్లాను చేసుకొని నిర్మాణం ప్రారంభించాలి. 
 
ముందుగా ఇంటి స్థలం చతురస్రంగానో, దీర్ఘచతురస్రంగానో సరిచేసుకోవాలి. అందులో ఉచ్ఛమైన స్థలంలో గృహం కట్టుకోవాలి. స్థలం ప్రాధాన్యంతోనే గృహ వైభవం ఉంటుంది. కానీ, ఎలాంటి ఇల్లు కడుతున్నాం అనేది ముఖ్యం. స్థలం అనే వజ్రపు తునకమీద మన జీవన వైభవం వెలగాలన్నది గమ్యంగా గృహానికి అంకురార్పణ చేయాలవని వాస్తు నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి