వాస్తు టిప్స్: పాడుబావులు, మొండి గోడలు ఉంటే...?

మంగళవారం, 15 డిశెంబరు 2015 (12:32 IST)
ఉత్తర ఈశాన్య సింహాద్వారం కలిగినప్పుడు ఎదురుగా దక్షిణ ఆగ్నే‌యమున కిటికి గాని ద్వారం ఏర్పాటు చేసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పాడుబడిన బావులు గాని, మొండి, గోడలు గాని, ఎండిన చెట్లుగాని ఇంటి ఆవరణలో ఉండుట మంచిది కాదని వారంటున్నారు.
 
తాత్కాలిక ఇళ్ళు తూర్పు దిక్కునగాని ఉత్తర దిక్కునగాని నిర్మించరాదు. ప్రహారి గోడలకు మూడు గేట్లు ఉండరాదు. సరిసంఖ్యలో ఉండుటమంచిది. మండువా ఇళ్ళకి, డాబాకి మరియు వాలు వసారాలకు వెన్నుపోటు దోషం ఉండదు. గృహములకు, ఉపగృహములకు మధ్యలో బావి ఉండుట మంచిదు కాదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి