డాబాలపై ఈశాన్య దిశలో వాటర్ ట్యాంక్ ఉంటే మంచిదా?

సోమవారం, 27 మార్చి 2017 (13:34 IST)
దక్షిణం కంటే తూర్పులో,  పశ్చిమం కంటే.. ఉత్తరాన అధిక ఖాళీ చోటును వదిలి ఇంటిని నిర్మించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వ్యాపారంలో రాణిస్తారు. సంతానం ద్వారా కీర్తి గడిస్తారు. అలాగే డాబాపై ఉత్తర, తూర్పు, ఈశాన్య దిశల్లో వాటర్ ట్యాంక్‌ను ఏర్పరచడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. తూర్పు, ఉత్తరాన గల భూములను కొనుగోలు చేయవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.
 
దక్షిణం, పడమర దిశల్లో ఇంటి స్థలాలను కొనడం కూడదు. ప్రధాన ద్వారానికి నేరుగు టాయిలెట్లు, బాత్రూమ్‌లు ఉండకుండా చూసుకోవాలి. ఎలాంటి ఇళ్లైనా నడిచే ప్రాంతంలో టాయిలెట్స్ ఉండకూడదు. కిచెన్‌కు ముందు ఉత్తరం లేదా తూర్పు దిశల్లో బాత్రూమ్‌లు నిర్మించడం కూడదు.
 
ఇలా వుంటే ఆ ఇంట్లోని మహిళలకు అనారోగ్య సమస్యలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీధి కంటే దిగువన ఇంటి నిర్మాణం ఉంటే.. ఆశించిన స్థాయిలో ఆదాయం ఉందని వారు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి