ఒకవేళ అలా ఉన్నట్లయితే స్త్రీల ఆధిపత్యం ఎక్కువ పుత్ర హాని కూడా...

శుక్రవారం, 23 నవంబరు 2018 (15:47 IST)
దైవబలం అనుకూలించడానికి, పురుష ప్రయత్నాల్లో సఫలీకృతులు కావడానికి తూర్పున వీధి కలిగిన స్థలం ఉత్తమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కనుక తూర్పు దిక్కున కొంత ఖాళీస్థలం ఉంచి ఇల్లు కట్టుకుంటే మంచిది. ఉత్తర దిశలో వీధిగల స్థలం కూడ ఉత్తమమయినదే. విద్యా విజ్ఞాన దైవబలం సంపన్నతకు, ధన ధాన్య సంపదలకు ఈ తరహా స్థలాలలో నివశించవచ్చు.
 
ఇక్కడ కూడా ఉత్తరం, తూర్పు దిక్కులలో తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. దక్షిణంలో వీధి ఉన్న స్థలం, మధ్యస్థమయినదిగా చెప్పుకోవచ్చు. అయితే ఈ స్థలం విశాలంగా ఉంటే శ్రేష్టమైనది గానే గుర్తించారు. కానీ వీధిలో ఇంటికి కానీ, వీధికి ఆటువైపు గానీ తూర్పు, ఉత్తర దిశలలో ఎత్తయిన ఇళ్ళు ఉండరాదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
పశ్చిమంలో వీధి ఉన్న స్థలం అధమమైనది. అనగా ఒక వీధిలో, తూర్పు దిక్కు ఇల్లుగలవారికి, ఎదుటి వైపున మరో ఇల్లు ఉంటుందన్న మాట. ఇలాంటి స్థలంలో తూర్పు దిశగా ఉండే ఇల్లుగానీ, ఉత్తర వైపుగా ఉండే ఇల్లుగాని ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే స్త్రీల ఆధిపత్యం ఎక్కువ పుత్ర హాని కూడా సూచితం.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు