వాస్తు శాస్త్రం: గోడల దోషాలు-ఫలితాలు

శనివారం, 5 జులై 2014 (16:45 IST)
ఇంటికి సంబంధించిన దక్షిణ దిశలో గోడ వెలుపలికి వంగిపోయినట్లయితే వ్యాధులు, మృత్యువు వెన్నంటి ఉండగలవని వాస్తు శాస్త్రం వెల్లడిస్తోంది. పశ్చిమ దిశలో గోడ బయటకు వంగి ఉన్నా ధనహాని, చోరబాధ, ఉత్తరదిశలోకి వంగి ఉన్నట్లయితే యజమాని వ్యసన పరుడుకాగలడని వాస్తు నిపుణులు పేర్కొన్నారు.
 
తూర్పుగోడ వెలుపలికి వంగినా రాజభయము కలుగునని వాస్తు తెలిపింది. ఇంటికి ఆగ్నేయమూలలో తూర్పు గోడ వెలుపలకు వంగిఉన్నట్లైతే అగ్నిభయం, దక్షిణానికి వంగినట్లైతే ప్రాణ భయము కలుగునని వాస్తు శాస్త్రం తెలుపుతోంది. గృహానికి నైరుతి మూల దక్షిణగోడ బయటకివంగినచో కలహాలు, ఆకస్మిక కోపాలు కలుగును, పడమరకు గోడ వంగినా యజమాని భార్యకు హాని కలుగునని వాస్తు తెలుపుతోంది. 

వెబ్దునియా పై చదవండి