ఆమ్‌చూర్, జీలకర్రలతో మసాలా కాకర

కావలసిన పదార్థాలు :
కాకరకాయలు (చిన్నసైజువి)... అరకేజీ
ఆమ్‌చూర్... అరటీస్పూను
జీలకర్రపొడి... అరటీస్పూను
ఉల్లిపాయలు... పావు కేజీ
కారం... తగినంత
ఉప్పు... తగినంత
నూనె... వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
కాకరకాయలను కడిగి చాకుతో వాటి పొట్టను నిలువుగా చీల్చాలి. కోసేటప్పుడు పైనా కిందా విడిపోకుండా జాగ్రత్తపడాలి. తరువాత కాయలోపలి గింజలను తీసి వేయాలి. ఓ గిన్నెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆమ్‌చూర్‌, జీలకర్ర... అన్నీ వేసి ఉల్లిమసాలా తయారుచేయాలి.

ఇప్పుడు ఈ మసాలాను కాకరకాయల్లో కూరి బయటకు రాకుండా, కాయల్ని లావుపాటి దారంతో కుట్టివేయాలి. మందపాటి బాణలిలో నూనె పోసి కాగుతుండగా కాకరకాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే ఆమ్‌చూర్, జీలకర్రలతో మసాలా కాకర సిద్ధమైనట్లే..! వీటిని అన్నంలో నంజుకుని తినవచ్చు, విడిగానూ స్నాక్స్‌లాగా కూడా తినవచ్చు.

వెబ్దునియా పై చదవండి