ఈ వానాకాలంలో టమోటా పచ్చడి టేస్ట్ చేస్తే..!

FILE
టమోటాలు విరివిగా తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎసిడిటీకి చెక్ పెట్టే టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి టమోటాలతో పచ్చడి టేస్ట్ చేస్తే అదిరిపోద్ది.. సరే టమోటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామా..

కావలసిన పదార్థాలు:
టమోటాలు - ఒక కేజి.
చింతపండు - 200 గ్రా.
కారం - 1 గిద్ద.
ఉప్పు - 1 డబ్బా.
మెంతి పిండి - కొంచెం.

తయారీ విధానం:
ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి. ఒక డబ్బాలో ఉప్పు, టమోటా ముక్కలు వేసి మూడు రోజులు ఊరనివ్వాలి. మూడవ రోజు వాటిని పిండి ఒక కవర్ మీద వేసి రెండు రోజులు ఎండ నివ్వాలి. ముక్కలు తీసిన ఊటలో రెండో రోజు చింతపండు వేసి నానబెట్టాలి.

ఆ తరువాత రోజు ముందుగా టమోటా ముక్కలు పోసి రుబ్బి తరువాత చింతపండు, కారం కూడా వేసి రుబ్బి జాడీలో పెట్టుకోవాలి. తరువాత తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపులో మెంతిపిండి వేస్తే మంచి సువాసన వస్తుంది.

వెబ్దునియా పై చదవండి