పండ్లను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో లభిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. అలాంటి ఫ్రూట్స్‌తో స్వీట్ సమోసా చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా..
కావలసిన పదార్థాలు: జాజికాయ పొడి - 1/4 టీ స్పూన్. నారింజ లేదా నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్. మైదాపిండి - ఒక కప్పు. నెయ్యి (పూర్ణానికి) - ఒక టేబుల్ స్పూన్. అరటిపండు, ఖర్జూరాలు - ఒక కప్పు. పంచదార - తగినంత
తయారీ విధానం: ముందుగా, పూర్ణానికి ఇచ్చిన వస్తువులన్నింటిని కలిపి పెట్టుకోవాలి. ఇందులో పంచదార కూడా చేర్చుకోవాలి. మైదాపిండికి నెయ్యి, నీరు చేర్చి చపాతీలు చేసుకోవాలి. వీటి మద్యలో పూర్ణం పెట్టి మూసేయాలి. పెనం వేడిచేసి, సమోసాలను వేసి, నేతితో రెండు వైపులా ఎర్రగా దోరగా వేయించుకుని.. సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది..