బఠాణీలు, పెసరలతో స్టఫ్‌డ్ రోల్స్ చేస్తే ఎలా వుంటుంది. తప్పకుండా పిల్లలు ఇష్టపడి మరీ తింటారు. బఠాణీలు, పెసరపప్పుల్లో ఉన్న ఫైబర్ పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచుతుంది. అలాంటి వాటితో స్టఫ్‌డ్ రోల్స్ ఎలా చేయాలో చూద్దాం..
తయారీ విధానం : ప్రెంచ్‌రోల్‌ను ఐదు ముక్కలుగా కట్‌చేసుకోవాలి. ఒక్కో భాగం ఓ కప్పులా ఉంటుంది. నింపడానికి వీలుగా అడుగు భాగం ఉండేలా చేసుకోవాలి. ఉడికించిన బఠాణీలు కాస్త అటు ఇటుగా చితపాలి. అందులో అల్లం, మొలకగింజలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, చాట్ మసాలా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కప్పుల్లాంటి ఒక్కో ప్రెంచ్‌రోల్‌లో నింపుకోవాలి. పైన కాస్త వెన్నను రాయాలి. వీటిని ఓవెన్‌లో పెట్టి 5-10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. తరిగిన ఉల్లిముక్కలతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.