మామిడి తురుము పచ్చడి ఎలా చేయాలో తెలుసా?

శనివారం, 3 ఆగస్టు 2013 (16:09 IST)
FILE
మామిడి కాయ తురుముతో పచ్చడి ఎలా చేయాలో మీకు తెలుసా.. అయితే దీన్ని ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు:
మామిడికాయ తురుము - రెండు కప్పులు
ఇంగువ - తగినంత.
ఉప్పు, పసుపు - తగినంత.
నూనె - 2 గరిటెలు.
వేయించిన ఆవాలు - 1 చెంచా.
మెంతులు - 1 చెంచా.
కారం - 2 లేక 3 చెంచాలు.

తయారీ విధానం:
ముందుగా ఆవాలు, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారం, మెంతులు, ఆవాల పొడి వేసి పెట్టుకోవాలి.

అదే మూకుడులో మరికాస్త నూనె వేసి మామిడి తురుము, పసుపు, ఉప్పు, వేసి మగ్గనివ్వాలి. ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తరువాత దీనిలో పక్కకు తీసిపెట్టుకున్న కారం, మెంతిపొడి వేసిన నూనె వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి