వంకాయ పచ్చడి వావ్.. వావ్!

FILE
వంకాయలో ఔషధ గుణాలెన్నో దాగివున్నాయి. కేన్సర్, హైపర్ టెన్షన్, డయాబెటిస్‌కు వంకాయ చెక్ పెడుతుంది. అలాంటి వంకాయతో పచ్చడి తయారు చేస్తే ఎలా వుంటుంది... ట్రై చేద్దామా..?

కావలసిన వస్తువులు:
వంకాయలు - 1 కిలో.
చింతపండు - 1/4 కిలో.
ఉప్పు - తగినంత.
కారం - తగినంత.

తయారీ విధానం:
ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. తరువాత చింతపండు, ఉప్పు, కొంచెం వంకాయ ముక్కలు వేసి, కారం కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మెదిగిన తరువాత మిగిలిన వంకాయ ముక్కలు వేసి కొంచెం పలుకుగా రుబ్బుకొని తీసుకోవాలి. తరువాత తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి వేడి అన్నంలోకి వేసుకు తింటే రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి