బాలింతలకు మేలు చేసే మందు పులుసు ఎలా చేయాలి?

మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (11:53 IST)
Ayurvedic gravy
బాలింతలకు మేలు చేసే పులుసును ఎలా తయారు చేయాలో చూద్దాం. అలాగే జలుబు, అజీర్తికి కూడా ఈ పులుసు మంచి ఔషధంగా పనిచేస్తుంది. 
 
కావలసిన పదార్థాలు 
ఉల్లిపాయ  తరుగు- పావుకప్పు, 
వెల్లుల్లిపాయలు - అరకప్పు, 
టొమాటో - 3, 
చింతపండు - నిమ్మ పండంత, 
కరివేపాకు, కొత్తిమీర తరుగు- అరకప్పు
ఉప్పు - కావలసినంత.
 
గ్రైండ్ చేసేందుకు : 
మిరియాలు - 3 టేబుల్ స్పూన్లు, 
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు, పిప్పళ్ల పొడి - పావు టీ స్పూన్
సొంఠి- పావు టీ స్పూన్ 
కారం - అర స్పూను, 
మెంతులు - పావు టీస్పూన్, 
ధనియాలు - 3 టేబుల్ స్పూన్లు
 
పోపు కోసం.. 
నూనె - 6 టేబుల్ స్పూన్లు,
ఆవాలు - 1 టీస్పూన్, 
మెంతులు - అర టీస్పూను, 
జీలకర్ర - అర టీస్పూను.
 
తయారీ విధానం: గ్రైండింగ్ కోసం ఇచ్చిన పదార్థాలను బాణలిలో వేసి వేడి చేసి చల్లారాక మెత్తగా రుబ్బుకోవాలి. వెల్లుల్లి, టొమాటో, కొత్తిమీర, ఉల్లిపాయలను మెత్తగా కోయాలి. చింతపండును రెండు కప్పుల నీళ్లలో కరిగించి వడకట్టాలి.
 
ఈ నీళ్లలో టొమాటోలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, కొద్దిగా ఉప్పు వేయాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, జీలకర్ర, మెంతులు వేసి వెల్లుల్లి, ఉల్లిపాయలను వేయించాలి.
 
ఉల్లి, వెల్లుల్లి బాగా వేగిన తర్వాత చింతపండు కలిపిన నీటిని పోసి ఐదు నిమిషాలు ఉడకబెట్టి.. గ్రైండ్ చేసుకున్న పొడిని చల్లుకోవాలి. ఈ గ్రేవీ రెండు నిమిషాలు ఉడకబెట్టాలి. అంతే బాలింతలకు మేలు చేసే పులుసు రెడీ అయినట్టే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు