క్యారెట్ దృష్టిలోపాలను దూరం చేస్తుంది. క్యారెట్లో బీటా-కెరోటిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. యాంటీయాక్సిడెంట్ ఏజెంట్‌గా పనిచేసే క్యారెట్‌లో విటమిన్ ఎ, సి, కె, విటమిన్ బి8, పొటాషియం ఐరన్, కాపర్ వంటి బోలెడన్నీ పోషకాలున్నాయి. అలాంటి క్యారెట్‌తో హల్వా, వేపుడు వంటివే కాకుండా చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం..
ఆవాలు, నూనె - పోపుకు తగినంత
తయారీ విధానం :
బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండును కూడా చేర్చి ఐదు నిమిషాల పాటు వేపాలి. వీటిని ఓ ప్లేటులోకి తీసుకుని ఆరబెట్టాలి. అదే బాణలిలో క్యారెట్ తురుమును ఐదు నిమిషాల పాటు వేపుకోవాలి.
ఆరాక మిక్సీలో ముందుగా ఎండుమిర్చి మిశ్రమాన్ని, ఆపై క్యారెట్ తురుమును ఉప్పు చేర్చి రుబ్బుకోవాలి. తర్వాత స్టౌమీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె, ఆవాలతో పోపు పెట్టి.. రుబ్బుకున్న చట్నీకి కలిపి రెండు నిమిషాల పాటు వేపాలి. అంతే క్యారెట్ చట్నీ రెడీ. ఈ చట్నీని వేడి వేడి దోసెలు, ఇడ్లీలకు సైడిష్‌గా తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.