మునగాకులో విటమిన్ -ఎ, విటమిన్ సి, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. మునగాకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి ప్రతిరోజూ ఉదయం రాసుకోంటే మొటిమలు నివారించబడతాయి. ముఖం అందం పెరుగుతుంది. మునగ పువ్వులు- చిగుర్లు కూరగా వండుకొని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
ఒక చెంచా మునగాకు రసంలో కొంచెం తేనెను కలిపి, దానికి ఒక గ్లాసు లేత కొబ్బరి నీరును కలిపి తీసుకుంటే కలరా, విరేచనాలు తగ్గుతాయి. మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా తాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకును పాలలో మరిగించి.. ఆ పాలను తాగుతూ ఉంటే వీర్యవృద్ది కలుగుతుంది. అలాంటి మునగాకుతో సూప్ ఎలా చేయాలో చూద్దాం...
కొబ్బరి తురుము - అర కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
తయారీ విధానం :
ఒక ప్యాన్‌లో ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను చేర్చి అందులో ఐదు కప్పుల నీటిని చేర్చి.. కాసేపు ఉడికించండి. మరో బాణలితో నెయ్యి పోసి వేడయ్యాక జీలకర్ర చేర్చి.. మునగాకును చేర్చి దోరగా వేపాలి. దీనిని క్యారెట్, కొబ్బరి తురుము వేగుతున్న మిశ్రమంలో కలపాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక ఆరబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి. ఆపై బౌల్‌లోకి తీసుకుని.. అందులో కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఉప్పు చేర్చి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే మునగాకు సూప్ రెడీ అయినట్లే.