హెల్దీ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలి.?

సోమవారం, 12 అక్టోబరు 2015 (18:28 IST)
సీసాల్లో భద్రపరిచిన కూల్‌డ్రింక్స్ కంటే తాజా పండ్ల రసాలు బెటర్. ఇంకా పండ్ల రసాల కంటే పండ్లను తాజాగా తీసుకోవడం లేదా సలాడ్ల రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి కావాల్సిన ఐరన్, క్యాల్షియం, విటమిన్లు లభిస్తాయి. అలాంటి ఫ్రూట్స్‌తో సలాడ్ ఎలా చేయాలో చూద్దామా.. 
 
కావలసిన పండ్లు :
మామిడిపండు ముక్కలు - 1 కప్పు 
ఆపిల్ పండు ముక్కలు - 1 కప్పు 
కమలాతొనలు - 1 కప్పు 
దానిమ్మ గింజలు - 1 కప్పు 
ద్రాక్షపళ్ళు - 1 కప్పు 
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు 
ఉప్పు - కొంచెం 
తేనె - 1/4 కప్పు 
నిమ్మ రసం - 2 స్పూన్లు 
అరటిపండు ముక్కలు - 1 కప్పు 
చెర్రీ పండ్లు - 1/2 కప్పు 
మిరియాలపొడి - 1/2 స్పూన్ 
 
తయారీ విధానం : 
ముందుగా పైన చెప్పిన పండ్లన్నింటినీ శుభ్రంచేసి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వీటి మీద మిరియాల పొడి, ఉప్పు వేసి నిమ్మరసం పిండి పైన తేనె వేసి నాలుగు గంటలపాటు ప్రిజ్‌లో ఉంచితే చాలు ఫ్రూట్ సలాడ్ సిద్ధమైనట్లే.

వెబ్దునియా పై చదవండి