న్యూ ఇయర్ స్పెషల్ : హెల్దీ క్యాప్సికమ్ పులావ్!

బుధవారం, 31 డిశెంబరు 2014 (18:45 IST)
క్యాప్సికమ్ పులావ్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సికమ్‌ను ఆహారంలో తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. అలాంటి హెల్దీ క్యాప్సికమ్‌తో న్యూ ఇయర్ సందర్భంగా  పులావ్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..  
 
కావలసిన పదార్థాలు: 
క్యాప్సికమ్: ఐదు కప్పులు 
జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్ 
నెయ్యి: ఒక టేబుల్ స్పూన్ 
లవంగాలు: ఐదు 
ఉప్పు: రుచికి సరిపడా
బియ్యం: అరకేజీ 
పంచదార: ఒక టేబుల్ స్పూన్ 
దాల్చిన చెక్క : కొద్దిగా
మిరియాలు: ఒక టీ స్పూన్ 
ఉల్లిపాయ: ఒక టీ స్పూన్ 
జీడిపప్పు పలుకులు: పావు కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్ 
పచ్చిమిర్చి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్ 
 
తయారీ విధానం: 
పాన్‌లో నెయ్యి వేసి వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిముక్కలు, ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి కాసేపు వేపుకోవాలి. బియ్యంలో రిపడా నీళ్ళుపోసి అన్నం ఉడికించుకోవాలి.

ఈ అన్నంలో ఉడికించుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మూత పెట్టాలి. అన్నం అంతా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లీ దించేయాలి. అంతే నూరూరించే క్యాప్సికమ్ పులావ్ రెడీ.. ఈ పులావ్‌ను వేడి వేడిగా బటర్ చికెన్, కడాయ్ పనీర్, టమోటా సాస్‌తో సర్వ్ చేస్తే టేస్ట్‌గా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి