సమ్మర్ స్పెషల్: మామిడి పలావ్ ఎలా చేయాలో తెలుసా?

మంగళవారం, 3 మే 2016 (15:57 IST)
వేసవిలో లభించే మామిడిని చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. పుల్ల పుల్లగా తియ్యగా ఉండే మామిడి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మామిడి తీసుకోవడం వల్ల కడుపులో అసిడిటీ తగ్గుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మామిడిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.

ఇది జీర్ణక్రియ సరిగా జరిగేలా సహాయపడుతుంది. వేసవిలో విరివిగా దొరికే మామిడికాయతో ఆవకాయంటే నోరూరకుండా ఉండదు. మామిడితో జ్యూస్‌లే కాదు మామిడి పెరుగన్నం, మామిడి పులిహోర, మామిడి పలావు, మామిడి పుడ్డింగ్ ఇలా రకరకాల వంటలు తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు మామిడి పలావు ఎలా చేయాలో తెలుసుకుందాం...
 
కావలసిన పదార్థాలు:
బాస్మతి రైస్: 1 కప్పు
మామిడి గుజ్జు : 1
జీడిపప్పు: 1/4 కప్పు
ఎండుమిర్చి: 2
నెయ్యి: 2
దాల్చిన చెక్క: తగినంత
లవంగాలు: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
పోపుగింజలు : తగినంత
 
తయారీ విధానం: 
ముందుగా బియ్యాన్ని అరగంటపాటు నీళ్ళల్లో నానబెట్టాలి. తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత గ్యాస్ మీద పాత్రపెట్టి అందులో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో పోపుగింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. అవి వేగాక బియ్యం వేసి కలియబెట్టాలి.

కొద్దిసేపు తరువాత అందులో మామిడిపండు గుజ్జు, కాస్త ఉప్పు వేసి, సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టాలి. అన్నం ఉడికాక గ్యాస్ ఆఫ్ చేసి, నెయ్యిలో వేయించిన జీడిపప్పును గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే నోరూరించే మ్యాంగో పులావ్ రెడీ.

వెబ్దునియా పై చదవండి