మష్రూమ్ పనీర్ మసాలాను ఎలా చేయాలో తెలుసా?

గురువారం, 1 అక్టోబరు 2015 (15:46 IST)
మష్రూమ్, పనీర్‌ ఒబిసిటీని దూరం చేస్తాయి. వీటిలోని పోషకాలు డయాబెటిస్‌ను దరిచేరనివ్వవు. అలాంటి కాంబినేషన్‌లో టేస్ట్ అదిరిపోయే మష్రూమ్‌ పనీర్‌ మసాలా ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు : 
మష్రూమ్స్ - ఒక కప్పు 
పనీర్ - ఒక కప్పు 
ఉల్లి తరుగు - అర కప్పు 
పసుపు - అర టీ స్పూన్
కోకో పౌడర్ - రెండు టీస్పూన్లు
జీలకర్ర - ఒక టీ స్పూన్ 
ఆవాలు - ఒక టీ స్పూన్
కొత్తిమీర తరుగు - గార్నిష్
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీ స్పూన్ 
పచ్చి మిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు 
ధనియాల పొడి - ఒక టీ స్పూన్
గరం మసాలా పొడి - అర టీ స్పూన్ 
ఉప్పు, నూనె- తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లి తరుగు వేసి బ్రౌన్ రంగులో బాగా వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి, మష్రూమ్స్, పసుపు, అల్లం వెల్లుల్లి  వేసి రెండు నిమిషాల పాటు దోరగా వేయించాలి. ఇందులో తురిమిన పనీర్‌ను కలపాలి. పనీర్‌ కరిగిన తర్వాత.. అందులో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలపాలి. ఈ పదార్థాలన్నీ వేగాక గ్లాసుడు నీటితో గ్రేవీలా చిక్కబడ్డాక దించేయాలి. అంతే మష్రూమ్, పనీర్‌ మసాలా రెడీ అయినట్లే. ఈ గ్రేవీకి కొత్తిమీర గార్నిష్‌తో రోటీలకు సైడిష్‌గా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.

వెబ్దునియా పై చదవండి