గణపతిని ముందుగా పూజించమని చెప్పింది ఎవరు? దాని వల్ల ప్రయోజనాలు
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (12:51 IST)
Siva parvatulu-ganeshudu
విఘ్నేశ్వరుడు, గణేశుడు, వినాయకుదు ఇలా ఎన్నో పేర్లతో పిలిస్తే పలికే ఏకదంతుడు పూజను ఎలా చేయాలో మార్కండేయ పురాణంలో పార్వతీపరమేశ్వరులు తెలియజేశారు. మహర్షులు, దేవతలు, కింపురుషులు వంటివారు మొదట ఎవరిని పూజించాలని స్వామి అంటూ పార్వతీపరమేశ్వరులు, వినాయకుడు, షన్ముఖుడు కలిసివున్న వేళ ఏతెంచి అడగడంతో ముందుగా అమ్మవారు గణేశుని పూజా విధానం ఇలా చేయాలంటూ తెలియజేసింది.
సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులు చెప్పిన గణేషా పూజా విధానం ` లాభాలు
గణపతిని నిత్యం భక్తితో పువ్వులతో గంథంతో నైవేద్యంతో నీరాజనంతో తాంబూలాలతో తదంతరం ప్రదక్షిణ నమస్కారాలతో పూజిస్తే సర్వంభక్తులకు ప్రసాదించుకు అని అమ్మవారు తెలియజేసింది. వారి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అందుకే మహర్షులకు పూజా విధానం తెలియజేసేవిధంగా శివుడితో కలిసి పూజించింది. ఇక్కడ గణేశుడు కుమారుడుకాదు. పూజార్హుడు అంటూ తెలియజేసింది. దేవతలంతా సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తూ పులకితులయ్యారు.
పూజ అనంతరం అమ్మవారు దేవతలకు ఇలా తెలియజేసింది.
` గణేశుడిని పూజిస్తే విఘ్నాలు తొలగుగాక. భక్తితో పూజిస్తే విఘ్నాలు పోతాయి. తిరస్కరిస్తే విఘ్నాలు కలిగిస్తాడు. ఇది మేము ఆయనకు ఇచ్చిన వరం. అందుకే అందరూ విఘ్నేశ్వరుడిని ముందుగా పూజిస్తే సర్వకోరికలు, రోగాలు కూడా మటుమామయవుతాయి.
` కొత్త ఇల్లు కానీ, దేవాలయంకానీ, కొత్త పనులు కానీ మొదలు పెడితే ముందుగా గణపతిని పూజించాలి. గణపతి పూజ లేకుండా ఎన్ని యాగాలు, హోమాలు చేసిన సంపూర్ణత కలగదు.
` ఒక్క విఘ్నేశ్వరుని పూజిస్తే మేమంతా కరుణిస్తాం. ఎందుకంటే మేంగణపతిలోనే వుంటాం.
`గణేశుడిని భాద్రపదమాసంలో శక్లపక్షంనాడు వచ్చే చతుర్థినాడే వినాయక చవివి వస్తుంది .అందుకే ఆరోజు మాత్రమే భక్తితో పూజించాలి. అలా చేస్తేనే ఆనందం పొందుతారు. ప్రతి ఏడాది చేస్తే శరీరం విడిచాక ముక్తి కూడా పొందుతారు.
`అన్ని రకాల పూలతోపాటు గరికకు ప్రాధాన్యత ఇవ్వాలి. గరికను వేళ్ళతో పూజించకూడదు. వాటిని కత్తిరించి పూజించాలి.
`గరికకు ఎందుకింత ప్రాధాన్యత అంటే?
`ఓ నాడు గరిక వచ్చి వినాయకుడికి తమ గోడు మొరపెట్టుకుంది. మమ్మల్ని అందరూ చాలా చులకనగా చూస్తున్నారు. పశువులు నమిలినమిలి తింటున్నాయి. మమ్మలి కాలితో తొక్కేస్తూ గౌరవం లేకుండా చేస్తున్నారు.. అని వేడుకోగా..
వెంటనే గణపతి మీకు నేనొక వరం ఇస్తున్నాను. నా పూజకు ఈరోజు నుంచి నెత్తిమీద పెట్టుకునే చేస్తాను. నీకు శాశ్వతపూజ అర్హత కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. అలా గరికను రెండు గాకానీ, గుత్తగాకానీ (కట్టలుగా) తీసుకుని పూజిస్తే మంచి ఫలితం వుంటుంది.
` ఇలా గరికతో పూజిస్తే సంపదలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి వుంటుంది.
` రాత్రి మొదటి జాములో స్నానం చేశాక అంటే 9గంటలలోపు పూజిస్తే భార్యభర్తల బంధం గట్టిపడుతుంది.