ఒత్తిడికి గురైన మహిళల్లో పెర్‌ఫ్యూమ్ వాడకం అధికం

శనివారం, 5 జనవరి 2008 (17:17 IST)
"ఒత్తిడికి గురైన మహిళలు అధికమొత్తంలో అత్తర్లు వాడతారు" అంటున్నారు పరిశోధకులు. అదెలాగంటే... ఒత్తిడికి గురైన మహిళలు వాసన చూసే శక్తిని కోల్పోతారు. వాసనను పసిగట్టగల గ్రంధులు క్రమేణా తమ శక్తిని కోల్పోవటంతో మహిళలు ఎక్కువ పెర్‌ఫ్యూమ్‌ను వాడతారు.

ఒత్తిడికి వాసనను గ్రహించగల శక్తికి సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనలలో వెల్లడైందని టెల్ ఎవివ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. ఘ్రాణ శక్తిపై జరిపిన పరీక్షలలో ఈ విషయం తేటతెల్లమైందని అధ్యయన బృందం నాయకుడు యెహుదా షోన్ఫీల్డ్ తెలిపారు.

'ఆటోయాంటిబాడీ' అనే కణం రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపటంతో ఈ పరిణామం తలెత్తుతున్నట్లు వారి పరిశోధనల్లో వెల్లడైంది. ఇటువంటి రుగ్మతలను... ముఖ్యంగా ఒత్తిడిని వదిలించుకోవటానికి అరోమాథెరపీ బాగా పనిచేస్తుందని, వాసనను గ్రహించగల శక్తిని కోల్పోయినవారు తిరిగి మళ్లీ ఆ శక్తిని పొందగలరని పరిశోధకులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి