నేరాల గుట్టువిప్పే అమ్మాయిల అధర సౌందర్యం!

శనివారం, 10 ఆగస్టు 2013 (13:55 IST)
File
FILE
అమ్మాయిలపై అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వీటి అడ్డుకట్టకు ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. అవి సరైన ఫలితాలను ఇవ్వడం లేదు. కనీసం నేరాలు జరిగిన తర్వాత నిందితుల ఆచూకీని కూడా గుర్తించలేక పోతున్నారు.

అలాంటి నేపథ్యంలో సరికొత్త నేర పరిశోధన మార్గాలను అన్వేషించడం అనేది అనివార్యం. ఈ ప్రయత్నాల్లో భాగంగానే.. అమ్మాయిల లిప్‌స్టిక్‌ మరకలను కూడా నేరపరిశోధనలో కీలకంగా ఎంచగల పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సిన విషయమేమిటంటే... ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానానికి రామన్‌ స్పెక్ట్రోస్కోపీ అని పేరు పెట్టారు. మన భారతీయ దిగ్గజం సీవీరామన్‌ డెవలప్‌ చేసిన సిద్ధాంతాల ఆధారంగానే.. ఈ పద్ధతిని కనుక్కొన్నందున ఆయన పేరు పెట్టినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాస్మెటిక్‌ ఎవిడెన్స్‌గా పిలిచే దీనిలో కేవలం లిప్‌స్టిక్‌ మరకలే కాదు.. అమ్మాయిలు వేసుకునే ఫౌండేషన్‌ ఐ లైనర్లు, క్రీముల అవశేషాలను కూడా విశ్లేషించనున్నట్టు తెలిపారు.

దీని ద్వారా నేరంలో నేరస్తుడికి బాధితురాలికి మధ్య ఏం జరిగిందో తెలుసుకోగలిగితే నేర పరిశోధన సులువు అవుతుందనేది అంచనా. టిష్యూపేపర్లు, గ్లాసులు, చెమ్చాలపై ఉండే లిప్‌స్టిక్‌, ఇతర కాస్మెటిక్‌ మరకల ద్వారా ఈ పరిశోధనను సాగించనున్నారు.

వెబ్దునియా పై చదవండి