మొబైల్ ఛార్జర్‌ను ఆవిష్కరించిన మహిళలు

సోమవారం, 8 అక్టోబరు 2007 (13:45 IST)
వాయు శక్తి చోదకంగా వినియోగించుకునే మొబైల్ ఫోన్ ఛార్జర్‌ను పాండిచ్చేరిలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు ఆవిష్కరించారు. తద్వారా ఏ రంగంలోనైనా సరే తాము పురుషులకు ధీటుగా నిలబడతామన్న వాస్తవాన్ని నిరూపించారు.

సాంప్రదాయేతర ఇంధన వనరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే పోటీలలో పాల్గొనేందుకు మార్గదర్శకత్వం వహించవలసిందిగా తమ లెక్చరర్ గాంధీ మోహన్‌ను ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్న అష్టలక్ష్మి, తమిళ్‌సెల్వి, గీత, శ్రీదేవి, ప్రియ, షర్మీ రోస్ మరియు విజయలక్ష్మిలు కోరారు. మోహన్ మార్గనిర్దేశకత్వంలో వాయు శక్తితో పనిచేసే మొబైల్ ఛార్జర్ ప్రాజెక్టును వారు చేపట్టినట్లు అదే కళాశాలకు చెందిన మరొక లెక్చరర్ కృపాకరన్ తెలిపారు.

తమ మొక్కవోని దీక్షతో నోకియా ఫోన్లకు మాత్రమే ఉపయోగించబడి 3.7 ఓల్టులతో పని చేసే ఛార్జి కాబడే ఛార్జర్‌ను అభివృద్ధి చేసారని కృపాకరన్ పేర్కొన్నారు. విద్యార్ధినులు ఆవిష్కరించిన పరికరంలో చిన్నపాటి మోటార్, చార్జర్ సర్క్యూట్ మరియు బ్యాటరీ ఉంటాయని ఆయన వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి