మహిళలు చర్మ సౌందర్యాన్ని పెంపొందింపజేసేందుకు బ్యూటీపార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధమైన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తేనే మీ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇంట్లోనే లభించే పదార్థాలతోనే చర్మాన్ని కాంతివంతం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అవేంటో చూద్దాం..
ఉసిరికాయ: విటమిన్ సి పుష్కలంగా కలిగివుండే ఉసిరిని కేశ సంరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరినూనెలో ఉసిరికాయలను వేసి తలకు పట్టిస్తే మృదువైన, దట్టమైన కేశాలు మీ సొంతం అవుతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.
సున్నిపిండి: సున్నిపిండిని రోజూ స్నానానికి ముందు ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతం అవుతుంది. అంతేగాకుండా సున్నిపిండి పాల క్రీమ్ కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే మొటిమలకు చెక్ పెట్టడంతో పాటు చర్మం పొడిబారకుండా ఉంటుంది.
పసుపు : క్రిములను నాశనం చేసే పసుపును చర్మానికి ఉపయోగించడం ద్వారా అలెర్జీలకు చెక్ పెట్టవచ్చు.
ఆపిల్ : మొటిమలు, మచ్చలను ఆపిల్ దూరం చేస్తుంది. ఆపిల్ మాస్క్ ద్వారా ఇంకా చర్మం మృదువుగా తయారవుతుంది. ముందుగా ఆపిల్ ముక్కలతో ముఖానికి మసాజ్‌లా చేయాలి. లేదంటే ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ పేస్ట్‌తో ఒక టేబుల్ స్పూన్ బంగాళాదుంప పేస్ట్ చేర్చి ముఖానికి పట్టించాలి. 10 లేదా 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది
కుంకుమ పువ్వు: మీరు అందంగా తెల్లగా కనిపించాలంటే కుంకుమ పువ్వును వాడాలి. పాలులో కుంకుమపువ్వును చేర్చి ముఖానికి పట్టిస్తే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, కంటి కింద ఉండే నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు.
రోజా పువ్వులు: తాజా పువ్వులతో తయారు చేసే రోజ్ వాటర్‌ను టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇది జిడ్డుకు చెక్ పెడుతుంది.