యువతులు లేదా మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ వారివారి వాక్షోజ సైజుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి కారణం వారి శరీరంలో తయారయ్యే హార్మోన్ల ప్రభావం. రజస్వల కాకముందు చిన్నవిగా ఉండే వక్షోజాలు, రజస్వల అయ్యాక జననేంద్రియాల పెరుగుదలతోపాటు వక్షోజాల సైజులు కూడా పెరుగుతుంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చాక, డెలివరీ అయ్యాక, బిడ్డకు పాలిచ్చేకాలంలో వక్షోజాల పరిమాణం పెరుగుతుంది.
వక్షోజాలలో పాలను తయారు చేసే గ్రంధులు, కొవ్వు, ఫైబర్ టిష్యూలు ఉంటాయి. వక్షోజాలపైన ఉండే నిపుల్స్‌లో సున్నితమైన కండరాలు ఉంటాయి. సెక్స్ కోరికలు కలిగినపుడు, పాలిచ్చేటపుడు ఈ నిపుల్స్ ఉబ్బుతాయి. అలాగే వక్షోజాల పరిమాణంలోనూ తేడా వచ్చి అవి పెరగడం జరుగుతుంది. బిడ్డకు పాలివ్వడం మానేయగానే క్షీరగ్రంథుల ఉత్పత్తి తగ్గిపోవడంతో పరిమాణం తగ్గుతుంది. బలవర్థకమైన ఆహారం, చిన్నపాటి వ్యాయామాలు వక్షోజాలను కొంతమేర బిగుతుగా తయారు అయ్యేందుకు దోహదపడతాయి.