కంప్యూటర్లను నాలుగు గంటలకంటే ఎక్కువ సేపు వాడితే?

బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:34 IST)
కంప్యూటర్లు ప్రస్తుతం ఉద్యోగాలలో ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే దీర్ఘకాలం కంప్యూటర్ వినియోగంతో ఏర్పడే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకుందాం. కంప్యూటర్‌ను నాలుగు గంటల కంటే ఎక్కువసేపు కంటిన్యూగా వాడటం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది.
 
నాలుగు గంటలకు పైగా కంప్యూటర్లు వాడేవారిలో 75% మంది కంటిచూపుకు గురవుతున్నారని, వీటిని నివారించేందుకు కంప్యూటర్ మానిటర్ నుంచి 25 అంగుళాల దూరం నుంచి కంప్యూటర్ ఆపరేట్ చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
కంప్యూటర్ వినియోగదారులు నిరంతరాయంగా ఉపయోగించకుండా ప్రతి గంట లేదా రెండు గంటలకు ఐదు లేదా పది నిమిషాలు విరామం తీసుకోవాలని.. నిరంతర కంప్యూటర్ వాడకం వల్ల కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కాబట్టి కంప్యూటర్‌ వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారా కంటికి, మెదడుకు ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు