మహిళలపై పెరుగుతున్న నేరాల సంఖ్య!

బుధవారం, 26 నవంబరు 2014 (18:07 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే నేరాల సంఖ్య 59 శాతం పెరిగిందని ఓ ఎన్జీవో సంస్థ వెల్లడించింది. అయితే శిక్షలు మాత్రం కేవలం 8 శాతం పడ్డాయని తెలిపింది.
 
ముంబైలో నివసిస్తున్న వారిలో 32 శాతం మంది నగరంలో రక్షణ లేదని భావిస్తుండగా, 36 శాతం మంది ఒక చోటి నుంచి మరో చోటికి సురక్షితంగా వెళ్ళే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు.
 
గత సంవత్సరంతో పోలిస్తే అత్యాచార కేసులు 47 శాతం, వేధింపు కేసులు 52 శాతం, చైన్ స్నాచింగ్ కేసులు 66 శాతం పెరిగాయి.

వెబ్దునియా పై చదవండి