ప్రసవం తర్వాతి బరువును తగ్గించాలంటే..?

సోమవారం, 11 మే 2015 (17:57 IST)
తొమ్మిది నెలలూ చక్కని పౌష్టికాహారం తింటూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అమ్మలు ఒళ్ళుచేసే మాట వాస్తవం. దాంతో ప్రసవం తర్వాత పెరిగిన బరువును తగ్గించుకునే ప్రయత్నాలు పడతారు. ఇందుకు కనీసం ఏడుగంటలపాటు నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రసవం తర్వాత చాలినంత నిద్రపోని తల్లులు త్వరితంగా పాత ఆకృతిని పొందలేరన్నది వారి అభిప్రాయం. 
 
సరైన విశ్రాంతి లభించకపోవడం వల్ల హార్మోన్స్‌లో మార్పులు ఏర్పడి, వారి ఆకలి పెరుగుతుంది. ఆరునెలల వయస్సు పిల్లల్లో రోజుకు ఐదుగంటలు అంతకంటే తక్కువ సమయం నిద్రపోయేవారిని, రోజుకు ఏడుగంటలు నిద్రపోయేవారితో పోల్చితే మొదటి పుట్టినరోజు నాటికి వారు 11 పౌండ్ల అదనపు బరువు కలిగివుంటారని తేలింది. అందుచేత ప్రసవం తర్వాత మహిళలు దాదాపు 7 గంటలైనా నిద్రపోవాల్సిందేనని వైద్యులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి