గంటలు గంటలు కుర్చీలకు అతుక్కుపోతున్నారా? ఐతే ఒత్తిడి తప్పదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఎడతెగని ఆలోచనలు.. ఒత్తిడికి కారణం గంటల పాటు కుర్చీకే పరిమితం కావడమని వారు చెప్తున్నారు. ఒత్తిడిని అధిగమించాలంటే.. ఒకే చోటున కూర్చోకూడదు. ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ.. ఒత్తిడికి గురిచేస్తుంటే.. టక్కున సీటు నుంచే లేవాలి. నాలుగు అడుగులు వేయాలి.
మనసంతా గజిబిజీగా ఉన్నప్పుడు మనసు తేలిక పడాలంటే మరో ప్రత్యామ్నాయం చక్కటి సంగీతం వినడం చేయాలి. పనిలో ఉన్నా సరే.. కాస్త ఒత్తిడిగా అనిపించినప్పుడు మంద్రస్థాయిలో సంగీతాన్ని వింటే మెదడుకు హాయిగా ఉంటుంది. ఒత్తిడిని జయించాలంటే.. టైమ్ టేబుల్ ప్రకారం పనులు చేయడం మంచిది. అదీ మీ సామర్థ్యానికి అనుకూలంగా వుండాలి. ఒత్తిడిని చూసి జడుసుకోకండి.. దాన్ని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తే.. మానసిక ఆందోళనలు లేని జీవితం మీ సొంతం అవుతుంది.