మహిళల్లో నెలసరి సమస్యలతోనే గుండెపోటు!

మంగళవారం, 16 డిశెంబరు 2014 (13:51 IST)
మహిళల్లో గుండెపోటుకు గల ప్రధాన కారణాలు తాజా అధ్యయనంలో తేలాయి. మహిళల్లో ఒత్తిడి, ఆహారం వంటి కారణాలే గుండెపోటు కారణమని కొన్ని అధ్యయనాలు తేల్చితే తాజాగా, మహిళల్లో నెలసరి సమస్యలతో గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. సుమారు 10 లక్షల మందికి పైగా మహిళలను భాగం చేస్తూ యూనివర్సిటీ అఫ్ ఆక్స్ ఫర్డ్ ఓ అధ్యయనం చేసింది. 
 
10 సంవత్సరాల లోపే బాలికలకు నెలసరి ప్రారంభమైనా, 17 సంవత్సరాల తరువాత నెలసరి మొదలైనా, వారిలో గుండె సంబంధిత రోగాల రిస్క్ అధికమని పరిశోధనలో వెల్లడైంది.  నెలసరి సమస్యలచే అధిక రక్తపోటు సమస్యలు వెంటాడుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. 
 
తమ అధ్యయనం ప్రకారం బాలికల్లో 13 సంవత్సరాలకు రజస్వల అయ్యేవారు మిగతావారితో పోలిస్తే గుండె జబ్బులకు దూరంగా ఉంటారని అధ్యయన రూపకర్త డెక్స్ టర్ కానోయ్ వ్యాఖ్యానించారు.  

వెబ్దునియా పై చదవండి