గర్భస్రావాలతో మహిళలకు ఆరోగ్య సమస్యలు తప్పవ్!

బుధవారం, 18 మార్చి 2015 (18:24 IST)
వైద్యపరమైన గర్భస్రావంతోనూ ఇబ్బందులు తప్పవని గైనకాలజిస్టులు అంటున్నారు. గర్భస్రావం ద్వారా గర్భాశయ ముఖద్వారం దెబ్బతినే అవకాశం ఉంది. అంతేగాకుండా.. భవిష్యత్తులో గర్భం దాల్చడానికి బలహీనమయ్యే అవకాశం ఎక్కువని గైనకాలజిస్టులు అంటున్నారు.
గర్భస్రావ సమయంలో గర్భసంచి పాడైపోతే, గర్భసంచి మీద మచ్చలు ఏర్పడతాయి.
 
అలాగే పొత్తికడుపు వాపు వ్యాధి కూడా బహుళ గర్భస్రావానికి ఒక కారణమవుతుంది. ఈ పీఐడీ వంధత్వానికి కూడా దారితీసే ఛాన్సుంది. పీఐడీ అనే వ్యాధి ప్రాణాంతకమైనది కూడా. దీనివల్ల ఫలోపియన్ ట్యూబ్స్ కణజాలానికి మచ్చలు ఏర్పడటం కారణ౦ అవుతుంది. దీనివల్ల అవి బలహీనపడి, చివరికి సంతానోత్పత్తి తగ్గిపోతుంది. అప్పుడప్పుడు పీఐడీ మిస్-కారేజ్ అయినపుడు లేదా గర్భస్రావ౦ తరువాత సంభవిస్తుంది. పీఐడీ ఉన్న స్త్రీలకూ గర్భసంచి వెలుపల గర్భం వచ్చే ప్రమాదం కూడా ఉంది.
 
బహుళ గర్భస్రావాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు చాలా ప్రమాదకరం. బహుళ గర్భస్రావాలతో అధిక రక్తస్రావం, సంక్రమణ, మూర్చలు, అనస్తీషియ సమస్యలు, రక్తం గడ్డకట్టుక పోవడం, గర్భాశయంలో నొప్పి, ఎండోటాగ్జిక్ షాక్, సీర్వికల్ గాయపడడం, రక్తస్రావం వంటి సాధారణ సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. రెండు కంటే ఎక్కువసార్లు గర్భస్రావం జరిగిన స్త్రీలు ఈ సమస్యలను ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. 
 
మరోవైపు బహుళ గర్భస్రావాల వల్ల విపరీతమైన పొత్తికడుపు నొప్పి, మంటలు, వాంతులు, జీర్ణ-ప్రేగుల ఇబ్బందులు వంటి ఇతర చిన్న సమస్యలు కూడా ఉంటాయని గైనకాలజిస్టులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి