రిటైర్మెంట్ ఉద్యోగినులకే కాదు.. గృహిణీకి అవసరమే!

గురువారం, 20 నవంబరు 2014 (16:36 IST)
అవునండి రిటైర్మెంట్ ఉద్యోగం చేసే వారికే కాకుండా.. గృహిణికీ అవసరమే. అందుకే బీమా పథకంలో చేరడం, కాస్త ఎక్కువ వడ్డీ ఇచ్చేలా బ్యాంకులో పొదుపు, మ్యూచువల్ ఫండ్‌లలో పొదుపు చేయడం వంటివి ఎంచుకోవాలి.
 
ఆలస్యం చేయకుండా వివిధ బ్యాంకులు, మదుపు సంస్థలు అందిస్తున్న సమస్త పథకాలనూ పరిశీలించండి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. 
 
సాధారణంగా గృహిణులుగా చిన్నపాటి పొదుపులూ.. చిట్టిల్లాంటి వేస్తుంటాం. ఆ సొమ్మునే రిటైర్మెంట్ ప్లాన్‌కు మళ్లించవచ్చేమో ఆలోచించండి. దీర్ఘకాలిక పథకాల వల్ల అధిక వడ్డీతోపాటు వృద్ధాప్యంలో భరోసా కూడా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి