ప్రెగ్నెన్సీలోనూ అందంగా కనిపించాలా?

గురువారం, 19 జూన్ 2014 (15:31 IST)
గర్భధారణ సమయంలో ఉల్లాసంగా సంతోషంగా ఉండాలంటున్నారు గైనకాలజిస్టులు. ఇలా ఉంటే మహిళలు చాలా అందంగా కనిపిస్తారు. గర్భం పొందగానే అన్ని సింపుల్‌గా, డల్‌గా, అన్ ఫ్యాషనబుల్‌గా ఉండాల్సిన పనిలేదు. గర్భధారణ సమయంలో ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.  
 
ముందుగా మీరు చేయాల్సింది యోగా, వాటర్ ఏరోబిక్ వంటివి చేయొచ్చు. డాక్టర్ల సలహాతో వ్యాయామం చేసుకోవచ్చు. అలాగే వ్యాయామం చేసే సమయంలో ఎక్కువ నీళ్ళు త్రాగాలి. ఇక సరైన మెటర్నిటీ దుస్తులు ఎంపిక చేసుకోండి. ఇవి మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ దుస్తుల్లో మీరు అందంగా కనిపిస్తారు. 
 
స్టైల్ అండ్ కంఫార్టబుల్ దుస్తులను కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తర్వాత కొనుగోలు చేయాలి. అలాగే వాటి మీదకు ఫర్ ఫెక్ట్ ఫేవరెట్ యాక్సెసరీస్ ధరిస్తే మరింత అందంగా కనబడుతారు. పర్ ఫెక్ట్ షూ, ఫ్లాట్ గా ఉండేవాటిని ఎంపిక చేసుకోవడం వల్ల సౌకర్యవంతంగా ఉంటాయి
 
గర్భిణీలు వారి రెగ్యులర్ డైట్‌లో తాజా పండ్లు, కూరగాయలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. వాటి వల్ల మీకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ అందుతాయి. ఫ్యాట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. కాఫీకి అలవాటు పడినట్లైతే కాఫీని మానకోవాలి. కాఫీ వల్ల స్కిన్ డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. 
 
నిద్రలేకుండా విశ్రాంతి లేకుండా చేస్తుంది. అలాగే మీ పొట్టలో పెరిగే శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. హెయిర్ స్టైల్ కూడా మీకు నప్పే విధంగా చేయించుకోండి. అలాగే మీ ప్రవర్తన మంచిగా ఉండాలి. మీరు సంతోషంగా, ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటే మరింత అందంగా కనబడతారు. మంచి ఆలోచనలను కలిగి ఉండాలని గైనకాలజిస్టులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి