పచ్చిబంగాళ దుంపతో ఇలా చేస్తే..?

గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:32 IST)
చాలామంది యువతీయువకులు పులిపిర్లతో బాధపడుతుంటారు. ముఖంపై నల్లటి రంగులో ఉండటం వలన ఇవి అందవిహీనంగా కూడా కనిపిస్తుంటారు. అయితే, వీటిని తొలగించకూడదని పెద్దలు చెపుతుంటారు. పలు రకాల వైద్యం చేసినప్పటికీ.. ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. 
 
అయితే, గృహ వైద్యంలో మాత్రం ఈ పులిపిర్లను నిర్మూలించవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఉల్లిపాయతో కొంతమేరకు ఉపశమనం పొందవచ్చంటున్నారు. ఉల్లిపాయను సగానికి కోసి.. పులిపిర్లపై నాలుగైదు వారాలు క్రమం తప్పకుండా రుద్దినట్టయితే తగిన ఫలితం లభిస్తుందని చెపుతున్నారు. 
 
అలాగే, అత్తిపండ్లు కూడా పులిపిర్లను పోగొట్టడంలో చాలా బాగా పని చేస్తాయని చెపుతున్నారు. చెట్టు నుంచి కోసిన వెంటనే తొడిమి నుంచే కారే జిగురులాంటి ద్రవాన్ని పులిపిర్లపై రాసినట్టుయితే ఫలితం ఉందని చెపుతున్నారు. అదేవిధంగా పచ్చిబంగాళ దుంప ముక్కతో పులిపిర్ల మీద సున్నితంగా రెండు వారాల పాటు రుద్దినట్టయితే తగిన ఫలితం ఉంటుందంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు