నూనె మరకలు తొలగిపోవాలంటే..?

సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (15:34 IST)
దుస్తుల మీద గ్రీజు లేదా నూనె పడినప్పుడు వెంటనే కడగకూడదు. దాని మీద చిన్నారులకు రాసే బేబీ పౌడర్‌ను చల్లి పఫ్‌తో అద్దాలి. ఇలా చేయడం ద్వారా జిడ్డు పౌడర్‌కు అంటుకుంటుంది. తర్వాత బ్రష్‌తో మరకపోయే వరకు రుద్ది, ఉతికితే సరిపోతుంది. 
 
* చాక్ పీస్‌లు పొడిచేసి మరకల మీద చల్లాలి. గంట తర్వాత లాండ్రీకిచ్చినా.. ఇంట్లో ఉతికినా మరక మాయం అవుతుంది. పిల్లల యూనిఫామ్‌లకూ, కార్పెట్లకూ గ్రీజు మరకలు అంటినప్పుడు.. మొక్కజొన్న పిండిని మరక మీద చల్లాలి. కాసేపు మడతపెట్టి పక్కన పెట్టాలి. తర్వాత ఏదైనా బట్టతో తుడవాలి. ఇలా చేస్తే మరక వదిలిపోతుంది.
 
* ఇలాంటి మరకలు పడినప్పుడు పౌడర్, మొక్కజొన్న పొడి అందుబాటులో లేకపోతే.. న్యూస్ పేపరును జిడ్డు మరకలపై పరవాలి. కాగితం ముందుగా నూనెను పీల్చుకుంటుంది. తర్వాత చేత్తో ఉతికితే మరక వదిలిపోతుంది.

వెబ్దునియా పై చదవండి