తొడిమలు తీసిన మిరపకాయలు ఎక్కువ రోజులు నిలువ ఉండవు. ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బిన పిండి లాంటివి ఫ్రిజ్‌లో ఉంచినపుడు వాటి మీద మూత పెట్టాలి.
ఫ్రిజ్ తలుపులను ఎక్కువసార్లు తీస్తువేస్తు ఉండటం, ఎక్కువ సమయం తెరిచి ఉంచడం వలన ఫ్రిజ్ త్వరగా పాడైపోతుంది. అరటిపండ్లను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. కండెన్సర్ మీద దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేయాలి. నెలకు రెండుసార్లు డీప్రాస్ట్ చేసి ఫ్రిజ్ లోపల శుభ్రం చేసి, బయట కూడా మరకలు, దుమ్ము లేకుండా తుడవాలి. ఫ్రిజ్‌లో పాలు, పెరుగు లాంటివి ఒలికితే ఫ్రిజ్ స్విచ్ ఆఫ్ చేసి శుభ్రం చేసుకోవాలి.