పెడిక్యూర్‌తో కాళ్ళకి బాగా విశ్రాంతి లభిస్తుంది. పెడిక్యూర్ ఇంట్లోనే చేసుకుంటే మరీ మంచిది. వీలైనప్పుడు పార్లర్‌కి వెళ్ళడం మంచిది. కొన్ని పార్లర్లలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. పెడిక్యూర్ చేయించుకున్న తరువాత కాళ్లు కిందపడితే ఫంగస్ అంటుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని కారణం పలురకాల ఇన్ఫెక్షన్స్ ఎదుర్కోవలసి వస్తుంది.
అలానే క్రమబద్ధమైన వ్యాయామం కాళ్ళ కండరాలను, నరాలను బలిష్టంగా చేస్తుంది. కాళ్ళకి సాధారణంగా వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది. రోజుకు రెండుసార్లు 10 నిమిషాల వరకు కొన్ని రోజులపాటు సాధారణ వ్యాయమం చేయడం వలన కాళ్ళు బలిష్టంగా తయారవుతాయి.