ఊరికి వెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు, సూచనలు పాటించండి. విద్య, ఉద్యోగం.. ఇలా వేర్వేరు కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. వెళ్లబోయే ప్రదేశం గురించి ముందుగా తెలుసుకున్నట్లైతే.. అక్కడి వాతావరణానికి తగ్గట్టు లగేజ్ బ్యాగును సిద్ధం చేసుకోగలుగుతారు.
చలి ప్రదేశానికి వెళ్లేటట్లైతే.. షాల్, స్వెటర్ వంటివి వెంట తీసుకెళ్లాలి. ఆ ప్రాంతానికి తగ్గట్లు సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవాలి. ఆకలి బాధ పడకుండా ఉండేందుకు వంట బ్రెడ్, జామ్, పండ్లూ, నట్స్ వంటివి తీసుకెళ్లాలి. ఇక ఖరీదైన బంగారు నగలను వెంట తీసుకెళ్లకపోవడం మంచిది. నగలు తప్పనిసరి అయితే ఫ్యాన్సీ నగలకే ప్రాధాన్యం ఇవ్వండి.
మేకప్ సామాగ్రి మొత్తంగా కాకుండా కిట్‌లా తీసుకెళ్లండి. వీటిలో దువ్వెన, రెండుమూడు క్లిప్పులు, కాటుక, మస్కారా, పౌడర్, లిప్‌జెల్ వంటివి ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. బ్యాగులు, కవర్లు అదనంగా తీసుకెళ్లండి. పెన్ను, నోట్ ప్యాడ్, టార్చ్ లైట్, అత్యవసర మందులూ, ఐడీ కార్డులు తీసుకెళ్లాలి.