ఫ్రిజ్ - మైక్రోవేవ్ ఓవెన్‌లను ఎలా శుభ్రం చేస్తారు?

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2016 (10:26 IST)
ఎలక్ట్రానిక్ వస్తువులు లేని ఇల్లంటూ ఏదీ లేదు. కాస్తంత డబ్బున్న వారిళ్ళలో అయితే, మైక్రోవేవ్ ఓవెన్‌ల, ఫ్రిజ్ ఇలా అన్ని ఉంటాయి. అయితే, వీటిని శుభ్రపరిచడమెలాని చాలా మందికి తెలీదు.  అది ఎలాగో తెల్సుకుందాం! 
 
ఫ్రిజ్‌ను లోపలి, బయటి ఉపరితలాన్ని మాత్రం వెనిగర్, నీరు కలిపి శుభ్రం చేయాలి. ప్రతి ఒరను విడివిడిగా కడగాలి. కూరగాయలుంచే ట్రేను తరచుగా కడగాలి. ఫ్రిజ్ లోపలి భాగాన్ని ఎలక్ట్రికల్ స్విచాఫ్ చేసి క్లీన్ చేయాలి. ఫ్రిజ్‌లో వెనిగర్ ఉంచితే చెడు వాసన రాదు.
 
మైక్రోవేవ్ ఓపెన్‌ను శుభ్రపరిచే సమయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. లోపల ఉండే రొటేటింగ్ ట్రేను బయటకు తీసి శుభ్రం చేయాలి. కోలిన్, ప్రిల్ స్ప్రే వంటి వాటిని శుభ్రంగా తడిగుడ్డతో తుడవాలి. క్లీనింగ్ ప్యాడ్‌తో లోపలపడిన మరకలను తొలిగించాలి. మైక్రో ఓవెన్‌ సేఫ్ బౌల్‌లో నీరుపోసి ఉంచి 5 నిమిషాల పాటు వేడిచేస్తే లోపల పడిన మరకల్ని సులువుగా తుడిచివేయవచ్చు. 

వెబ్దునియా పై చదవండి