లేటు వయస్సులో చివరి సంతానం.. అమ్మకు మంచిదే!?

శనివారం, 24 జనవరి 2015 (18:24 IST)
లేటు వయసు అమ్మల ఆయుష్షు ఎక్కువేనని అధ్యయనంలో తేలింది. పెద్ద వయస్సులో చివరి సంతానాన్ని కన్న స్త్రీలు ఎక్కువ కాలం జీవించే అవకాశాలున్నాయని పరిశోధకులు తేల్చారు. 
 
స్త్రీలు ప్రసవించే వయసును ఆధారంగా చేసుకుని జరిపిన పరిశోధనల్లో 29 ఏళ్ల వయస్సులో చివరి సంతానాన్ని కన్న స్త్రీలలో పోలిస్తే 33 ఏళ్ల వయసు దాటిన సమయంలో ప్రసవించిన స్త్రీలు 95 ఏళ్ల పాటు జీవించగలుగుతారని పరిశోధనలు నిరూపించాయి. 
 
అయినప్పటికీ లేటు వయస్సు ప్రసవించిన స్త్రీలందరికీ ఆయుష్షు ఎక్కువేనని చెప్పలేమని బోస్టన్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. 551 కుటుంబాల్లోని స్త్రీలను పరీక్షించిన పరిశోధకులు స్త్రీలలో వయోభారం నెమ్మదించడానికి కారణం వాళ్లు ఆలస్యంగా చివరి సంతానాన్ని కనటమేనని గుర్తించారు. 
 
ఇలాంటి స్త్రీలు జన్యువులను తర్వాతి సంతానానికి సరఫరా చేయడం ద్వారా ఆయుర్ధాయాన్ని తర్వాతి తరానికి సంక్రమింపజేస్తున్నట్లు వైద్యులు గమనించారు. బహుశా 85 శాతం మంది స్త్రీలు నిండు నూరేళ్లు బతకటానికి ఇదే ప్రధాన కారణమైవుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి