ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో.. ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికీ అంతే కష్టపడాలి. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పోటీ ప్రపంచంలో మనుగడ సాధ్యం అవుతుంది. కొలువు కుదిరిన చోట మంచి మార్కులు రావాలంటే విషయ పరిజ్ఞానం తప్పనిసరి. నేర్చుకున్నదాన్ని ఉద్యోగంలో ఎలా అప్లై చేయాలనే విషయం తెలిసుండాలి. వీలైతే సీనియర్స్ సహాయంతో పనిలోని మెలకువలు తెలుసుకోవాలి.