కాన్పుకు కాన్పుకు మధ్య తేడా లేదా.. అయితే, ఆస్టియోపోరోసిస్ ఖాయం...

గురువారం, 11 ఫిబ్రవరి 2016 (08:58 IST)
మహిళలల్లో ఒక కాన్పు తర్వాత మరో ప్రసవానికి మధ్య కనీసం రెండు సంవత్సరాలు తేడా ఉండాలట. లేనిపక్షంలో తల్లికి ఆస్టియోపొరోసిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆస్టియోపొరోసిస్‌లో క్యాల్షియం, విటమిన్‌-డి లోపం కారణంగా ఎముకలు కణజాలాన్ని కోల్పోయి పెళుసుగా తయారవుతాయట. ప్రెగ్నెన్సీలకి మధ్య కనీసం సంవత్సరమైనా వ్యవధి లేనివాళ్లు ఈ వ్యాధి బారినపడే అవకాశం నాలుగురెట్లు అధికంగానే ఉందని వారంటున్నారు. 
 
మెనోపాజ్‌ దశ కంటే ముందే ఎముకలు బలహీనతపై ప్రెగ్నెన్సీల మధ్య వ్యవధితో పాటు బిడ్డకి పాలివ్వడం, మొదటి ప్రెగ్నెన్సీ అప్పుడు తల్లి వయసు వంటి అంశాలు ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు అంటున్నారు. అంతేకాదు మెనోపాజ్‌ దశకు చేరుకోని మహిళలను పరీక్షించగా 27 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో తల్లయిన వాళ్లలో ఆస్టియోపొరోసిస్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వెల్లడైంది. 

వెబ్దునియా పై చదవండి