గర్భిణీలకు ప్లమ్ ఫ్రూట్ జ్యూస్‌తో ఎంతో మేలు!

శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (18:19 IST)
ఫ్లమ్ ఫ్రూట్స్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా వరకు చాలా మంది గర్భిణీ స్త్రీలు ఎక్కువగా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటారు. అటువంటివారి రియల్ లైఫ్‌లో ప్లమ్ జ్యూస్ చేర్చుకుంటే గొప్ప ప్రయోజనాలను తక్షణం పొందవచ్చునని గైనకాలజిస్టులు అంటున్నారు. 
 
ప్లమ్ ఫ్రూట్స్‌లో అనేక విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఎ, సి కెలు ఉన్నాయి. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి, కణవిభజనకు చాలా అవసరమవుతాయి. విటమిన్ సి వ్యాధి నిరోధకను పెంచుతుంది మరియు విటమిన్ కె రక్తం గడ్డకట్టడాన్ని అరికడుతుంది. ప్లమ్ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇటు తల్లికి అటు బిడ్డలోనూ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

వెబ్దునియా పై చదవండి