గజ్జి, తామరకు బైబై చెప్పే బంగాళాదుంప రసం....

మంగళవారం, 30 మే 2023 (17:06 IST)
potato juice
బంగాళదుంపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య వస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే బంగాళా దుంపల్లో వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగివున్నాయి. ఇది శరీరంలో ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. 
 
కంటి శుక్లాలు, కళ్ల వాపు వంటి సమస్యలను కూడా నయం చేస్తుంది. బంగాళదుంప రసం తాగడం వల్ల పొట్టలో ఎసిడిటీని నియంత్రించే శక్తి లభిస్తుంది. ఎసిడిటీ సమస్య వచ్చినప్పుడు 50 ఎంఎల్ నుండి 100 ఎంఎల్ వరకు బంగాళదుంప రసం తీసుకోవచ్చు. 
 
గజ్జి, తామర వంటి చర్మ సమస్యలతో బాధపడేవారు బంగాళదుంప రసం తాగవచ్చు. బంగాళదుంప రసాన్ని కళ్ల కింద కూడా రాసుకోవచ్చు. 
 
బంగాళాదుంప రసం కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ముఖం, కళ్లు ఉబ్బి ఉంటే బంగాళదుంప రసం వాడవచ్చు. ఇందులో ఉండే నీటి శాతం వాపును తగ్గిస్తుంది. ఇది చర్మానికి సహజమైన మెరుపును కూడా అందిస్తుంది.
 
బంగాళదుంపలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఒక గ్లాసు బంగాళాదుంప రసం దాదాపు ఒక రోజు విలువైన విటమిన్ సిని అందిస్తుంది. 
 
బంగాళాదుంపలో జింక్, కాల్షియం, విటమిన్ కె వంటి పోషకాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చుండ్రు బాధితులు బంగాళదుంప రసాన్ని తలకు పట్టిస్తే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు