గర్భం ధరిస్తే విపరీతమైన చెమట పడుతుందా?

బుధవారం, 30 జులై 2014 (15:29 IST)
ఈ తరహా సమస్యను చాలా మంది గర్భిణిలు ఎదుర్కొంటుంటారు. సాధారణంగా గర్భిణి మెటబాలిక్ రేటు పెరగడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అందువల్ల తరచుగా నీళ్లు తాగుతూ రెండు పూటలా స్నానం చేస్తున్నట్టయితే, శరీరాన్ని కొంతమేరకు పొడిగా ఉంచుతుంది. 
 
వీలైనంత వరకు శరీరానికి గాలి ఆడేలా చూడాలి. ఎక్కువగా ఎండలో తిరగకూడదు. ప్రసవం తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. అప్పటి వరకు ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు విధిగా తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి